కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 429 కోట్లతో పఠాన్ రికార్డ్

Pathaan Worldwide Box Office Collection,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pathaan,Pathaan Movie,Pathaan Telugu Movie,Pathaan Update,Pathaan Updates,Pathaan Movie Updates,
బాక్సాఫీస్1 ని. చదువు

ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 429 కోట్లతో పఠాన్ రికార్డ్

Pathaan Worldwide Box Office Collection

Pathaan Worldwide Box Office Collection,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pathaan,Pathaan Movie,Pathaan Telugu Movie,Pathaan Update,Pathaan Updates,Pathaan Movie Updates,

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ హిందీ మూవీ జనవరి 25వ తేదీ పలు భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ ఈ మూవీలో పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. దీపికా పడుకొనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ ఈమూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పఠాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 106 కోట్లు వసూళ్ళు సాధించి మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరింది. బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు పఠాన్ మూవీ కి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 429 కోట్ల వసూళ్ళ తో దూసుకుపోతోంది. ఇండియా వైడ్ గా రూ.265 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో రూ.164 కోట్లు వసూల్ చేసిందని సమాచారం. నాలుగో రోజు కలెక్షన్లతో హిందీ సినిమా చరిత్రలోనే హైయ్యస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ వీకెండ్ గా పఠాన్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్