యథార్థ సంఘటన ఆధారంగా తెల్ల కాగితం.. ఆకట్టుకుంటున్న టీజర్

Thellakaagitham Official Teaser out now

నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తెల్ల కాగితం’ అధికారిక టీజర్ విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథతో టీజర్ ప్రారంభమవుతుంది. “మీరంతా ఒక తెల్ల కాగితం లాంటివారు.. అలాంటి తెల్ల కాగితం మీద ఒక ఎర్ర మచ్చ పడితే…” అంటూ సాగే డైలాగ్ కథలోని అసలు ఘట్టాన్ని, లోతైన ఎమోషన్స్‌ను తెలియజేస్తోంది. ఆ తర్వాత ప్రశాంతంగా సాగే ప్రేమికుల జీవితంలో ఎదురైన ఒక పెద్ద సమస్య, దాని నుంచి బయటపడేందుకు వారు చేసే పోరాటం టీజర్‌లో ఆకట్టుకున్నాయి.

హర్ష్ రోషన్, నక్షత్ర జంట స్క్రీన్ పై చాలా సహజంగా కనిపించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లో చక్కని అభినయం కనబరిచారు. విజయ్ బుల్గానిన్ అందించిన ఆకట్టుకునే నేపథ్య సంగీతం, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ ఈ టీజర్‌ను సరికొత్త అనుభూతిగా నిలిపాయి.గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.