తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో తను చేస్తున్న సార్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఈసినిమా కాకుండా శేఖర్ కమ్ములతో కూడా మరొక సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇంకా తమిళ్ లో పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా తాజాగా ధనుష్ 50 వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈసినిమా తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈనేపథ్యంలో సన్ పిక్చర్స్ వారు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని తెలియచేశారు. ఈ కథ నార్త్ చెన్నైకి సంబంధించిన ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని సన్ పిక్చర్స్ వారు తెలియజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























