వాల్తేరు వీరయ్య తన జోరును ఏ మాత్రం తగ్గించట్లేదు. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి యాక్టివ్ అండే జోష్ ఉన్న పాత్ర చేయడంతో ఈసినిమాకు అంత ఆదరణ లభిస్తుంది. బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. వింటేడ్ చిరును మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక రవితేజ కూడా ఈసినిమాకు విజయంలో భాగమయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ షాకిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలో కూడా వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది ఈసినిమా. కాగా చిరు సినిమాల్లో ‘సైరా నరసింహా రెడ్డి’ 2.6 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అమెరికాలో ఎక్కవ వసూళ్లు సాధించిన చిరు సినిమా ఇదే. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ ఈ రికార్డ్ అందుకునేందుకు ఎన్నో రోజులు పట్టేలా కనిపించడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Pure domination of Veerayya at USA Box Office 💥
MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya enters the elite $ 2M club ❤️🔥💥
MEGASTAR @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/1KUZpM6flv
— Mythri Movie Makers (@MythriOfficial) January 19, 2023
కాగా ఈసినిమా సక్సెస్ జోష్ తో చిరు తన తరువాత సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం తను మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.