టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్.డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లు, అలానే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇవి సినిమాపై అంచనాలను బాగానే పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























