ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్ద ఎవరంటే చాలామంది మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారు. ఒకప్పుడు అయితే ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి దగ్గరుండి సమస్యను పరిష్కారం చేసేవారు. ఇక దాసరి చనిపోయాక ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. అప్పటినుండి ఆ ప్లేస్ ను దాదాపు మెగాస్టార్ రీప్లేస్ చేశారు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలపై ముందుగా స్పందిస్తున్నారు. పెద్దరికంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిపై కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారనుకోండి. ఇక ఇప్పుడు మరోసారి పెద్దరికం పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిరు.. హైదరాబాద్ లో చిత్రపురికాలనీలో జరిగిన నూతన ఇళ్ల ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ నిర్మాణానికి 22 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిందని.. ప్రస్తుతం తాను కొంచెం బిజీగా ఉన్నప్పటికీ… ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పడంతో… తాను కచ్చితంగా ఇక్కడ ఉండాలని వచ్చానని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి వంటి వారి దూరదృష్టి వల్లే సినీ కార్మికుల సొంతింటి కల సాకారం అయిందని చెప్పారు. ఇంకా పెద్దరికం గురించి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో పెద్దరికం అనుభవించాలనే కోరిక తనకు లేదని.. తనకు పెద్దరికం వద్దని… అయితే, సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని.. భగవంతుడు తాను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడని తెలిపారు.
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తను వాల్తేరు వీరయ్య అనే సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ఇక ఈసినిమా తరువాత చిరు ఇప్పటికే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























