ఆదిత్య 999- త్వరలో లాంచింగ్ ప్లాన్?

Aditya 369 Sequel Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Balakrishna,Nandamuri Balakrishna,Aditya 369,Aditya 369 Movie,Aditya 369 Telugu Movie,Aditya 369 Movie Updates,Aditya 369 Telugu Movie Latest News,Aditya 369 Sequel,Aditya 369 Movie Sequel,Aditya 369 Telugu Movoie Sequel,Aditya 369 Sequel OnCards

టాలీవుడ్ లో అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో బాలకృష్ణ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా తరువాత కామెడీ ఎంటర్ టైనర్ లు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. బాలకృష్ణ కోసం ఇప్పటికే సాలిడ్ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఇక వీటితో పాటు మరో ప్రాజెక్ట్ ను కూడా బాలకృష్ణ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా సీక్వెల్ అయితే తప్పకుండా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో అన్నది మాత్రం ఇప్పటివరకూ తెలియదు. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకు ‘ఆదిత్య 999’ పేరుతో సీక్వెల్ ప్లాన్ చేసిన బాలయ్య.. ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేశారని, ఫిబ్రవరిలో లాంచింగ్ ఉంటుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మోక్షజ్ఞ ఈసినిమాలో కీలక పాత్రలో పోషించే అవకాశం ఉంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగమే ఆదిత్య 369. టైమ్‌ మెషీన్ బ్యాక్ డ్రాప్ తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ మైలు రాయిగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.టైమ్ మిషన్, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం సెట్టింగ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =