తన రిటైర్మెంట్ పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Megastar Chiranjeevi Interesting Comments on his Retirement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Upcoming Movie News,Megastar Chiranjeevi Next Film Details,Megastar Chiranjeevi Shocking Comments on his Retirement,Megastar Chiranjeevi Comments on his Retirement,Megastar Chiranjeevi Sensational Comments on his Retirement

రిటైర్మెంట్.. సాధారణంగా రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది.. వయసు పై బడిన వారు తమ బాధ్యతలను తప్పుకుంటూ రిటైర్మెంట్ చెబుతుంటారు.. మరి ఉద్యోగస్తులకైతే రిటైర్మెంట్ ఉంది.. సినీ పరిశ్రమ వాళ్లకు రిటైర్మెంట్ ఉంటుందా అంటే అది వ్యక్తిగత నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉండి.. ఎన్నో సినిమాలు చేసి.. క్షణం తీరిక లేకుండా అలుపెరుగని ప్రయాణం చేసిన వాళ్లు కాస్త బ్రేక్ కోసం రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ అలా తీసుకున్న నటీనటులు చాలా తక్కువే అని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ అవ్వడం సక్సెస్ అవ్వడం అంతే అంత ఈజీ కాదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వల్ల తమ టాలెంట్ ను చూపించుకొని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు కానీ ఒకప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కష్టాలను, ఆటుపోట్లను ఎన్నో మాటలను తట్టుకొని ఇప్పుడు లెజెండరీ నటులు అయినవారు కూడా ఉన్నారు. ఒకసారి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన తరువాత అవకాశాలు రాకపోయినా అక్కడే కొంతమంది ఉంటారు. అంత ప్యాషన్ తో ఉంటారు. అందుకే వయసుతో సంబంధం లేకుండా వెండితెరపై కనిపించాలనే అనుకుంటారు.

ఇక ఈనేపథ్యంలో సినీ పరిశ్రమలో రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. తాను నటించడం కోసమే ఇండస్ట్రీలోకి వచ్చాను కెమెరా ముందు ఉన్నంతవరకూ నటుడిగా ఎంతవరకు వెళ్ళడానికి అయినా నేను సిద్ధమే.. షూట్ అయ్యాక నా బాధలు నేను పడతాను కానీ ప్రేక్షకులని నా అభిమానులని అలరించడానికి మాత్రం షూటింగ్ లో ఎంత బాధని అయినా భరిస్తానని దానిని బయటకి మాత్రం వ్యక్తం చేయనని చెప్పారు. సినిమాలలో నటించలేకపోతున్నాను అని అనిపిస్తే ఆ రోజున సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్.. కానీ ఆ రోజు ఒక నటుడు జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు.. ఇక్కడకి కష్టపడడానికి వచ్చాము ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా నిలబడిగలిగే వారే ఉన్నత స్థాయిలోకి వస్తారు. అలా కాదు అనుకున్న వారు ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవచ్చు అని చిరు తెలిపారు. దీంతో రిటైర్మెంట్ ప్రశ్నపై చిరు సమాధానం చాలామందికి ఇన్పిరేషన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తను వాల్తేరు వీరయ్య అనే సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ఇక ఈసినిమా తరువాత చిరు ఇప్పటికే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.