చైతు కస్టడీ నుండి రానున్న బ్లాస్టింగ్ అప్ డేట్

Naga Chaitanya Custody Movie Surprising Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Custody,Custody Movie,Custody Telugu Movie,Custody Movie Updates,Custody Telugu Movie Latest News,Naga Chaitanya,Custody Movie Shooting Updates,Custody Telugu Movie Shooting Latest News

నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది తెలుగులో రెండు సినిమాలు బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిలో బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అందించగా.. థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక చైతు కూడా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇంతవరకూ రాలేదు. దీంతో చైతు ఫ్యాన్స్ కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి న్యూ ఇయర్ కు బ్లాస్టింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు చిత్రయూనిట్ తెలియచేసింది. మరి ఆ అప్ డేట్ టీజర్ గురించి అయి ఉంటుందేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఏ అప్ డేట్ ఇస్తారో..

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.