శాకుంతలం మూవీ అందమైన ప్రేమ కథ – నీలిమ గుణ

Shaakuntalam Movie is a Beautiful Love Story Says Producer Neelima Guna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaakuntalam Telugu Movie Latest News,Shaakuntalam Movie Story,Shaakuntalam Movie Live Updates,Shaakuntalam Movie Shooting Updates,Shaakuntalam Telugu Movie Shooting Latest News

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న శాకుంతలం మూవీ 3D ఫార్మాట్ లో ప్రేక్షకులను అలరించనుంది.రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత శాకుంతలం మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో శాకుంత‌లం సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శాకుంత‌లం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమా రిలీజ్ అవడానికి లేట్ కు కారణం గురించి నిర్మాత నీలిమ మాట్లాడుతూ .. శాకుంతలం అందమైన ప్రేమ కథ అనీ , ప్ర‌కృతిలో ఒడిలో అందంగా సాగే స్టోరిఅనీ , ఈ ప్రేమ క‌థ జంతువులు, ప్ర‌కృతితో ప్రేమించ‌బ‌డిందనీ , ప్ర‌కృతితో శ‌కుంత‌ల ఒదిగిపోయిన తీరు.. దుష్యంతుడి అద్భుత‌మైన ప్రేమ క‌థ‌. అత‌ని పరాక్ర‌మం వంటి వాటిని త్రీడీ టెక్నాల‌జీలోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలనీ , త్రీడీ మూవీ కావ‌టంతో సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌కు స‌మ‌యం ప‌డుతుందనీ , అందుకనే సినిమా రిలీజ్ కావటానికి సమయం పడుతుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + one =