తమిళ్ స్టార్ హీరో సూర్య విలక్షణ డైరెక్టర్ బాల కాంబినేషన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివ పుత్రుడు సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. సూర్యకి సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది ఆసినిమా. ఆతరువాత కూడా వారిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ఇక ఈమధ్య ఒక సినిమాను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. దానికి అచలుడు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. అయితే పలు కారణాలవల్ల ఈసినిమా నుండి సూర్య తప్పుకున్న సంగతి తెలిసిందే కదా. కథల మార్పుల విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సూర్య తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాలో సూర్య స్థానంలోకి మరో హీరోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది బాల. అరుణ్ విజయ్ సూర్య పాత్రలో నటించనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టనున్నారు. మరి సూర్య చేసినప్పుడు సూర్య ప్రొడక్షన్ హౌస్ లో ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. మరి ఇప్పుడు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో చూడాలి. అంతేకాదు ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఇప్పుడు సూర్య తప్పుకున్నాడు.. ఈనేపథ్యంలో కృతిశెట్టి ఈసినిమాలో హీరోయిన్ గా చేస్తుందా.. తప్పుకుంటుందా అన్నది చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























