RC 15 కొత్త షెడ్యూల్ అప్ డేట్

Ram Charan And Shankar Movie Shooting Latest Update, Ram Charan Movie Shooting Latest Update, Shankar Movie Shooting Latest Update, Ram Charan And Shankar Movie, Ram Charan, Kiara Advani, S. Shankar, Dil Raju, Sirish, Ram Charan Movies, Ram Charan Latest Movie, Ram Charan Upcoming Movie, RC15, RC15 2023, RC15 Movie, RC15 Telugu Movie, RC15 Movie Latest Update, RC15 Latest News, RC15 Movie Update, RC15 Live Updates, RC15 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ‘RC 15’ పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక శంకర్ అటు ఇండియన్ 2 సినిమాను అలానే చరణ్ సినిమాను రెండింటిని పార్లల్ గా పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే చరణ్ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను న్యూజిలాండ్ లో పూర్తిచేసుకున్నారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో చరణ్, కియారా మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ లో జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, రాజమండ్రి ఇంకా వైజాగ్ లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ ను జరపనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 20 =