తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వుమెన్ సెంట్రిక్ ఫిలింస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కనెక్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోయిన్ నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కనెక్ట్ టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా కనెక్ట్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ U /A సర్టిఫికేట్ ను జారీ చేసింది. కనెక్ట్ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: