సన్‌సెట్ సర్కిల్ బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా ఆర్ఆర్ఆర్

RRR Bags another prestigious International Award, prestigious International Award, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movies, Rajamouli Movies, S. S. Rajamouli, Ajay Devgn, NTR, Ram Charan, Alia Bhatt, Olivia Morris, RRR, RRR 2022, RRR Movie, RRR Telugu Movie, RRR Update, RRR News, RRR Latest News, RRR New Update, RRR Movie Live Updates, RRR Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ లో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రదర్శించారు. ఇటీవలే హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ఆర్ ఆర్ ఆర్ మూవీ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. ఈ విభాగంలో మరో 4 అంతర్జాతీయ సినిమాలు పోటీపడగా..ఆర్ఆర్ఆర్ సినిమా విన్నర్‌గా ఎంపికైంది. ఇక ఉత్తమ దర్శకత్వం విభాగంలో ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్న ఈ సినిమా ఇప్పుడు సన్‌సెట్ సినిమా అవార్డు గెల్చుకోవడంతో మరోసారి ఖ్యాతినార్జించింది.ఇటీవల జపాన్ దేశంలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్న రెండవ సౌత్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసి దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =