టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె . విశ్వనాథ్ ను నిన్న లోక నాయకుడు కమల్ హాసన్ ఆశీస్సులు అందుకున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో క్లాసిక్స్ అనదగ్గ సినిమాలు వచ్చాయి. 1985లో వీరి కాంబినేషన్లో వచ్చిన స్వాతిముత్యం సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీని సైతం దక్కించుకుంది. స్వాతిముత్యం సినిమాకు పలు జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఇంకా వీరి కాంబినేషన్లో సాగరసంగమం, శుభసంకల్పం వంటి ఉత్తమ చిత్రాలు తెరకెక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Our #Ulaganayagan aka #KamalHassan met the legendary director #KViswanath garu at his home in Hyderabad!! ✨❤️@ikamalhaasan #TeluguFilmNagar pic.twitter.com/clNcz27ei8
— Telugu FilmNagar (@telugufilmnagar) November 23, 2022
తాజాగా హైదరాబాద్ లో కమల హాసన్ నేరుగా కళాతపస్వి ఇంటికెళ్లి ఆయన చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకుని ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆరోగ్యం గురించి కమల్ అడిగి తెలుసుకున్నారు. గురువుగారిని వాళ్లింట్లో కలిశాననీ , ఎన్నో మధురస్మృతులను గుర్తుచేసుకున్నామనీ, వారంటే ఎంతో గౌరవమనీ అంటూ వారిద్దరి ఫోటోను కమల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































