పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు తరుణ్ భాస్కర్. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఆతరువాత ఈ నగరానికి ఏమైంది సినిమా తీశాడు. అంతేకాదు అప్పుడప్పుడు గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడంతో పాటు హీరోగా కూడా తన టాలెంట్ ను చూపించాడు. ఇక తరుణ్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఆ మధ్య వెంకీతో సినిమా చేస్తున్నట్టు కూడా తెలిపాడు కానీ ఇంతవరకూ క్లారిటీ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ మరి తెలిపింది.
కాగా విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడదుల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: