టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయిలు అంజలి , రీతూ వర్మ , ఈషా రెబ్బా , శ్రీ దివ్య , బిందు మాధవి , ఆనంది , తేజస్వి సక్సె ఫుల్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు అమ్మాయి చాందిని చౌదరి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ లో నటించబోతున్నట్లుగా స్వయంగా చాందిని చౌదరి అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు ప్రేక్షకులకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన చాందిని చౌదరి టాలీవుడ్ లో మెల్ల మెల్లగా హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంటున్నారు. చాందిని కథానాయికగా నటించిన “కలర్ ఫోటో” సినిమా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్ తో చాందిని మంచి గుర్తింపు పొందారు.కోలీవుడ్ లో చాందిని చౌదరి నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఈమె కు మంచి గుర్తింపు దక్కడం ఖాయం అంటున్నారు. తమిళ ప్రేక్షకులు ప్రతిభ ఆధారంగా ఆదరిస్తారు. మంచి నటనతో ఆకట్టుకుంటే తమిళ ఇండస్ట్రీ కూడా వరుసగా ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అందుకే కోలీవుడ్ లో చాందిని టాప్ స్టార్ గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































