‘భోళా శంకర్’ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Anil Sunkara Interesting Comments About Bholaa Shankar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar latest Updates,Bholaa Shankar Producer Anil Sunkara,Bholaa Shankar Movie latest News, Bholaa Shankar Shooting Updates,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Upcoming Movie Bholaa Shankar,Chiru Upcoming Movie Bholaa Shankar Latest Updates, Anil Sunkara Interesting Comments on Bholaa Shankar,Anil Sunkara About Bholaa Shankar,Bholaa Shankar Movie Latest Shooting Updates

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఇక ఈమధ్య ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి వార్తలు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గానే మళ్లీ ఈసినిమా షూట్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ పాజిటివ్ కామెంట్స్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ సుంకర తన బ్యానర్ గురించి తమ సినిమాల గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇప్పటివరకూ పలు సినిమాలు మా బ్యానర్ నుండి వాటిలో చాలా వరకూ ప్రేక్షకాదరణ పొందాయి.. ప్రస్తుతం తమ బ్యానర్ నుండి పలు సినిమాలు వస్తున్నాయని.. అయితే వాటిలో మాత్రం రెండు సినిమాలు మాత్రం మంచి సక్సెస్ అందుకుంటాయనే నమ్మకం ఉందని తెలిపారు. అందులో భోళా శంకర్ సినిమా కూడా ఉంది. భోళా శంకర్ సినిమా గురించి చెబుతూ.. మెహర్ రమేష్ చాలా బాగా తీస్తున్నారని, సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సినిమా సాగినప్పటికీ మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండేటట్లు మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడని తెలిపారు. అవుట్ పుట్ ప్రస్తుతం బాగా వస్తోందని, వచ్చే ఏడాది రిలీజ్ కానున్న మూవీ తప్పకుండా మంచి సక్సెస్ కొడుతుందని అన్నారు.

కాగా ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =