“దేఖ్ ఖబర్ రఖ్ నజర్ ” (1982)ఒడియా మూవీ తో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించిన గౌతంరాజు సక్సెస్ ఫుల్ “నాలుగు స్థంభాలాట”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి , రవితేజ , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ నటించిన పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు ఎడిటర్ గా పనిచేసిన గౌతంరాజు సూపర్ హిట్ “ఆది ” మూవీ కి బెస్ట్ ఎడిటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు,తమిళం, కన్నడ, హిందీ భాషలలో సుమారు 800 సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు.గౌతంరాజు మరణం తో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గౌతంరాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































