ఎడిటర్ గౌతంరాజు కు సినీ ప్రముఖుల నివాళులు..!

Tollywood Mourns Senior Editor Gautham Raju’s Sudden Demise,Senior Tollywood editor Gautam Raju passes away,Telugu film editor Gautham Raju passes away,Popular Tollywood editor Gautam Raju passes away,Senior Editor Gautam Raju Passes Away,Senior Editor Gautam Raju,Popular Editor Gautam Raju Passes Away,Telugu film editor Gowtham Raju passes away at 68,Editor Gautam Raju Passes Away,Gowtham Raju,Gowtham Raju Latest News,Gowtham Raju Live Updates,Gowtham Raju Is No More,Gowtham Raju No More,RIP Gowtham Raju,Rest In Peace Gowtham Raju,Gowtham Raju Passes Away,Gautam Raju Passes Away,Tollywood Popular Senior Editor Passes Away,Senior Telugu editor Gautam Raju,Senior Tollywood editor Gautam Raju passed away,Telugu Senior film editor Gautham Raju passes away,film editor Gautham Raju passes away,Telugu Popular film editor Gowtham Raju passes away at 68,Gowtham Raju passes away at 68,Popular editor Gautam Raju,Gautam Raju famous editor of Telugu films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Celebrities condole Gowtham Raju's demise,Gowtham Raju's demise,Telugu film industry mourns editor Goutham Raju's demise,Tollywood Celebs About Gautham Raju,Tollywood Mourns Gautham Raju’s Sudden Demise,Tollywood Celebs Mourns Gautham Raju’s Demise,Nandamuri Balakrishna,Harish Shankar,Vishnu Manchu,Sai Dharam Tej,Ram Charan,Tollywood Mourns Senior Editor Gautham Raju’s Demise,#GauthamRaju,#RIPGauthamRaju

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్ననే విలక్షణ నటుడు ఆర్ నారాయణ మూర్తి తన తల్లిని కోల్పోయారు. ఇక నేడు తెలుగు ఇండస్ట్రీ మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్ సినీ ఎడిటర్‌ గౌతంరాజు నేడు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దాదాపు 800 సినిమాలకు పైగా గౌతంరాజు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈమధ్య కాలంలో అయితే ఎంతో మంది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌, రవితేజ కిక్‌, అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలకు ఆయన ఎడిటర్‌గా వర్క్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాలకు కూడా ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. ఆది సినిమాకు ఆయనకు ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డు కూడా వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. గౌతమ్ రాజులాంటి గొప్ప ఎడిటర్ ని కోల్పోవడం దురదృష్టకరం.. ఆయన ఎంత సౌమ్యుడో..వారి ఎడిటింగ్ అంత వాడిగా ఉందున్నారు. ఆయన మితభాషి కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితం.. ఎంత నెమ్మదస్తుడో ఆయన ఎడిటింగ్ అంత వేగం. నా చట్టానికి కళ్లు లేవు నుంచి ఖైదీ నెం.150 వరకు ఎన్నో చిత్రాలకు నాకు పనిచేసిన గౌతంరాజు లేకపోవడం వ్యక్తిగతంగా, మొత్తం సినీ పరిశ్రమ కు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నానని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన శ్రీ గౌతమ్ రాజు గారు మృతి విచారకరం అని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఎడిటర్ గౌతంరాజు గారి మరణం చాలా బాధాకరం. గౌతంరాజు అద్భుతమైన ప్రతిభ గల ఎడిటర్. నాకెంతో ఆత్మీయులు. మృదు స్వభావి. అనేక విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశాం. ఎడిటర్ గా గౌతంరాజు గారు తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 4 =