తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈసినిమాలో రామ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అలానే పాటలకు రెస్పాన్స్ రావడంతో పాటు అవి సినిమా పై బాగా అంచనాలు క్రియేట్ చేసాయి. మరోవైపు చిత్రయూనిట్ ఒకపక్క ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతుంది. ఉన్న తక్కువ టైమ్ ను ప్రమోషన్స్ కోసం బాగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అలానే వేదిక కూడా ఖరారు చేస్తూ ప్రకటించారు. చెన్నై లోని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సత్యం సినిమాస్ లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి జరుగనున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలానే త్వరలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























