పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘ప్రణీత’

Pranitha Subhash Blessed With A Baby Girl,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pranitha Subhash,Actress Pranitha Subhash,Pranitha Subhash Movie Updates,Pranitha Subhash latest Updates,Pranitha Subhash Blessed with Cute Baby Girl, Pranitha Subhash Latest Updates She Blessed with Baby Girl,Pranitha Subhash Movies,Pranitha Subhash Upcoming Movie,Pranitha Subhash latest Baby Updates

కరోనా వల్ల సినీ పరిశ్రమకు చాలా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి.. ఎన్నో సినిమాల షూటింగ్ లు మద్యలోనే ఆగిపోయాయి. అయితే కరోనా మాత్రం సెలబ్రిటీల పెళ్లిళ్లకు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఎంతో మంది హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు కరోనా టైమ్ లోనే జరిగాయి. అందులో నటి ప్రణీత సుభాష్ కూడా ఉంది. కరోనా టైమ్ లోనే ప్రణీత వివాహం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొద్దిమంది సమక్షంలో ప్రణీత వివాహం జరిగింది. రాజు అనే వ్యాపార వేత్త‌ను వివాహం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ప్రణీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈమధ్య కాలంలో ప్ర‌ణీత త‌న బేబీ బంప్ ఫొటోల‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంది. తాజాగా పండంటి ఆడ‌శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఇక ఈవిషయాన్ని తాజాగా తన ఇన్ట్సా ద్వారా తెలియచేసింది ప్రణీత. తన పాపను పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. గ‌త కొద్ది రోజులుగా తను చాలా బాధపడుతున్నాని.. అయితే త‌న బిడ్డ జ‌న్మించ‌గానే ఆ బాధ‌నంతా మ‌ర్చిపోయాన‌ని తెలియ‌జేసింది. అంతేకాదు.. త‌న డెలివ‌రీకి స‌హ‌క‌రించిన గైన‌కాలిజ‌స్టు డాక్ట‌ర్ జ‌య‌శ్రీ‌, డాక్ట‌ర్ సునీల్ ఈశ్వ‌ర్‌, మ‌త్తు డాక్ట‌ర్ సుబ్బు, ఇత‌ర సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.