నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నాగశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా , మేఘా ఆకాష్, కావ్యశెట్టి ప్రధాన పాత్రలలో యూత్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో “గుర్తుందా శీతాకాలం”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “లవ్ మాక్‌టైల్”కన్నడ మూవీ ఆధారంగా “గుర్తుందా శీతాకాలం” మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టైటిల్ సాంగ్ లో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. “గుర్తుందా శీతాకాలం”మూవీని జూలై 15 వ తేదీ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారని సమాచారం. ఈ మూవీ తో పాటు హీరో సత్యదేవ్ “గాడ్సే “, “గాడ్ ఫాదర్”, “రామ్ సేతు (హిందీ ) మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: