వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. ఆతర్వాత అన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా మాత్రం ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ఈసినిమా రిలీజ్ పై ఇన్నిరోజులూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు థియేటర్లలో రిలీజ్ అవుతుందని అన్నారు.. కొన్ని రోజులు ఓటీటీలో రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఆతర్వాత ఈసినిమా గురించి అప్ డేట్స్ రావడం కూడా ఆగిపోయాయి. దీంతో అసలు ఈసినిమా రిలీజ్ అవుతుందా?లేదా?అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా నేడు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 1వ తేదీన ఈసినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Witness the epic tale of LOVE and REVOLUTION on the Big Screens this monsoon ♥#VirataParvam Grand Theatrical Release worldwide on July 1st 🔥#VirataParvamOnJuly1st@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @laharimusic @SLVCinemasOffl pic.twitter.com/7BZXTmSpLe
— Suresh Productions (@SureshProdns) May 6, 2022
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: