‘జయమ్మ పంచాయితీ’ మూవీ రివ్యూ

Jayamma Panchayathi Movie Review,Jayamma Panchayathi Telugu Movie Review,Jayamma Panchayathi Review,Jayamma Panchayathi,Jayamma Panchayathi Movie,Jayamma Panchayathi Telugu Movie,Jayamma Panchayathi First Review,Jayamma Panchayathi Movie Public Talk,Jayamma Panchayathi Movie Public Response,Jayamma Panchayathi Live Updates,Jayamma Panchayathi Movie Story,Jayamma Panchayathi Movie Highlights And Plus Points,Suma kanakala,MM Keeravaani,Balaga Prakash,Vijay K,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews,Telugu Movies 2022,Telugu Filmnagar,Jayamma Panchayathi Telugu Movie Public Talk,Jayamma Panchayathi Public Response,Jayamma Panchayathi Public Talk,Jayamma Panchayathi Movie Public Talk And Public Response,Jayamma Panchayathi Telugu Movie Review And Rating,Jayamma Panchayathi Movie Review And Rating,Jayamma Panchayathi Movie Rating,Suma kanakala Movies,Suma kanakala New Movie,Suma kanakala Jayamma Panchayathi Movie Review,Suma kanakala Jayamma Panchayathi Movie,Suma kanakala Jayamma Panchayathi,Jayamma Panchayathi Movie Updates,Jayamma Panchayathi Movie Live Updates,Jayamma Panchayathi Telugu Movie Latest News,Suma kanakala Latest Movie,#JayammaPanchayathi,#JayammaPanchayathiReview

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఎన్నో ఏళ్లు బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణించిన సుమ వెండితెరపై రీఎంట్రీ ఇస్తుంది. ఇన్నేళ్ల తరువాత సుమ ప్రధాన సినిమా వస్తుండటం మరోవైపు సుమ సినిమా అనే సరికి ఈసినిమాపై మొదటినుండీ ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈసినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సుమ, దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్, నికిత, గణేష్ యాదవ్, భువన్ సాలూరు ,గేదెల త్రినాధ్, అమ్మ రామకృష్ణ, మాయానంద్ ఠాకూర్ రెడ్డి మహేశ్వర రావు, డి హేమ త‌దిత‌రులు
దర్శకత్వం.. విజయ్ కుమార్ కలివరపు
బ్యానర్..వెన్నెల క్రియేషన్స్
నిర్మాత.. బలగ ప్రకాష్
సంగీతం..ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫి.. అనూష్ కుమార్

క‌థ‌..

జయమ్మ (సుమ) తన భర్త మరియు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తుంటుంది. అలా హాయిగా వారి జీవనం సాగిపోతుండగా జయమ్మ భర్త (దేవి ప్రసాద్) అనుకోకుండా అనారోగ్యానికి గురవుతాడు. ఇక తన భర్త చికిత్స కోసం జయమ్మకు పెద్ద మొత్తంలోనే డబ్బు అవసరమవుతుంది. ఈక్రమంలో జయమ్మ తన సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీకి వెళుతుంది. మరోవైపు అదే సమయంలో గ్రామ పెద్దలు వేరే సమస్యను పరిష్కరించడంలో బిజీ అవుతారు. దీంతో జయమ్మ తన సమస్యకు పరిష్కారం చెప్పాల్సిందేనని ఊరి పెద్దలతో గొడవకు దిగుతుంది. ఆ తరువాత ఏం జరిగింది.. జయమ్మ సమస్యను ఎలా పరిష్కరించారు.. అసలు ఈ జయమ్మ పంచాయితీ ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా కొనసాగుతుందన్నది ఎప్పుడో అర్థమైపోయింది. పల్లెటూరి నేపథ్యాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. గ్రామ పంచాయితీ సీన్స్, హెల్తీ కామెడీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయింది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు బాగానే అనిపిస్తాయి. అయితే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం డైరెక్టర్ సక్సస్ అయ్యాడు. కామెడీ సన్నివేశాలు, గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. కొత్త సినిమా అయినప్పటికీ కథను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు. కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్ల ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్‌గా చేశాడు..

నిజానికి ఈసినిమాకు అంత హైప్ రావడానికి ప్రధాన కారణం సుమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుమ కాబట్టే ఈసినిమా ప్రమోషన్స్ లో స్టార్ హీరోలు సైతం సపోర్ట్ అందించారు. అసలు తన సినిమా ప్రమోషన్స్ నే ఎక్కువగా చేయని పవన్ సైతం సుమ కోసం టైమ్ ను కేటాయించి మరి ట్రైలర్ రిలీజ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు సుమ టాలీవుడ్ లో ఎంత అభిమానం సొంతం చేసుకుందో. ఇక బుల్లి తెరపై కూడా ఎంతమంది యాంకర్స్ఉన్నా కూడా సుమ ని మించిన యాంకర్ ఇప్పటివరకూ రాలేదు.. ఇకపై వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే తను ఇన్నేళ్లు బుల్లి తెరకే అంకితమైపోయింది. కెరీర్ బిగినింగ్ లో నటిగా ఆమె సినిమాలు చేసింది కానీ ఆ తరువాత బుల్లితెరకే పరిమితమైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో సుమ కూడా మరోసారి బిగ్ స్క్రీన్ పై తన లక్ ను పరీక్షించుకోవడానికి జయమ్మ పంచాయితీ అంటూ వచ్చేసింది.

ఇక పెర్ఫామెన్స్ విషయానికి వస్తే సుమ యాక్టింగ్ స్కిల్స్ గురించి తెలిసిందే కదా. జయమ్మ పాత్రలో సుమ జీవించేసింది. స్క్రీన్ పై మనకు జయమ్మ మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫీల్ ను తీసుకొస్తుంది సుమ. కామెడీ సన్నివేశాల్లో తన కామిక్ ను ఎలాగైతే వదల్లేదో.. అలానే ఎమోషనల్ సీన్లలోనూ అంతే సీరియస్ గా నటించింది. ఇక ఈసినిమా తరువాత సుమ సినిమాల్లో కూడా బిజీ అవుతుందేమో. ఇక సుమ భర్తగా చేసిన దేవి ప్రసాద్ తన పాత్రను జస్టిఫై చేసి డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగ‌తా న‌టీన‌టులు కూడా అల‌రించారు.

ఈసినిమాలో చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ ఇంకా ఆర్ట్ డైరెక్టర్ గురించి.. ఆర్ట్ డైరెక్టర్ ధను వేసిన సినిమా విలేజ్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక అనుష్క కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కీరవాణి సంగీతం సినిమాకి మరో హైలైట్ గా నిలిచింది.

ఓవరాల్ గా చెప్పాలంటే మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాను అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పలేము. కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏం ఉండవు కాబట్టి యువతకు ఈసినిమా ఎంతవరకూ నచ్చుతుందో చెప్పలేము. అయితే సుమను ఆదరించేవారికి అయితే ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.