ఈమధ్య న్యాచురల్ స్టార్ నాని ఏం మాట్లాడినా వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల టికెట్ల రేటు పెంపుపై మాట్లాడగా అప్పట్లో దానిపై పెద్దఎత్తున చర్చలే జరిగాయి. ఇక ఇప్పుడు మరోసారి నాని చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకులకు కోపం తెప్పించాయి.. అసలు సంగతేంటంటే నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నాని ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. అయితే కన్నడలో డబ్ చేయకుండా తెలుగు వర్షన్ విడుదల చేస్తున్నాం. చాలా మంది కన్నడ ప్రజలు తెలుగును అర్థం చేసుకుంటారని, తెలుగు చిత్రాలను చూడటానికి ఇష్టపడతారని అందుకే ఈసినిమా తెలుగు వెర్షన్ నే కన్నడలో రిలీజ్ చేస్తున్నామని తెలిపాడు. దీంతో నాని వ్యాఖ్యలపై కన్నడ ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నానిని ట్యాగ్ చేస్తూ తెలుగు హీరోలు తమ సినిమాలను కన్నడ ప్రేక్షకులు చూడాలనుకుంటే, కన్నడలోకి కూడా డబ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇక దీంతో నాని కూడా దీనిపై స్పందించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. “డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ కుటుంబం ఎలా ఆదరాభిమానాలు చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్‌లో ఒక నిర్దిష్ట సందర్భంలో సమాధానం వస్తుంది. సోషల్ మీడియాలో ఆ సందర్భాన్ని బయటకు తీశారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్ప్పలేకపోయినందుకు సారీ… బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్ కు గర్వపడుతున్నా” అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ ఇష్యూ ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి..
Apologies if Not conveyed properly 🙏🏼proud of Kannada cinema and its success across the boundaries 🤍
— Nani (@NameisNani) April 20, 2022




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























