డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీకి కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆర్ ఆర్ ఆర్ “మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి గల కారణాల్లో ఒకటి రాజమౌళి సాలిడ్ టేకింగ్ , సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి స్వరపరిచిన సంగీతం మరొకటి. కీరవాణి స్వరపరచిన సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ కి హైలైట్ గా నిలిచాయి. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను ఒక నెల రోజులలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశామనీ , అందరిని ఎంతో ఆకట్టుకున్న మల్లి సాంగ్ ని కూడా జత చేసి రిలీజ్ చేస్తున్నామనీ కీరవాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























