గత కొంతకాలంగా డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నితిన్. కమర్షియల్ చేస్తూనే వాటిలో కాస్త డిఫరెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక ఈనేపథ్యంలో నితిన్ తాజాగా చేస్తున్న సినిమా మాచర్ల నియోజక వర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రేపు అంటే మార్చి 24న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలియచేశారు. మరి ఆ అప్ డేట్ ఏంటో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































