ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఏ పాత్ర అయినా సరే అవలీలగా చేసే వాళ్లను మాత్రమే విలక్షణ నటులు అంటారు. అలాంటి నటుల్లో యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో పాత్ర అయినా ఆది చేయగలడు.. రంగస్థలం సినిమాలో చేసిన కుమార్ బాబు పాత్ర లాంటి పాత్ర అయినా చేయగలడు.. అజ్ఞాత వాసి, సరైనోడు చిత్రాలల్లో చేసినట్టు స్టైలిష్ విలనిజాన్ని కూడా చూపించగలడు. అందుకే ఆది పినిశెట్టి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు మరోసారి మరో సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది వారియర్. ఈసినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గానే ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. గురు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. పోస్టర్ చూస్తుంటే ఆది చాలా పవర్ ఫుల్ రోల్ లోనే నటిస్తున్నట్టు అర్థమవుతుంది.
Every Warrior has a Foe.🔥
Here is Guru, the ultimate foe of #TheWarriorr ⚔️#HappyMahashivratri @ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @iAksharaGowda @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl pic.twitter.com/BmstqtaIkb— The Warriorr (@TheWarriorrFilm) March 1, 2022
మరి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలోకి ఆదిని ఎంటర్ చేసి ఇంకా అంచనాలను పెంచేశారు మేకర్స్. మరి ఈ కుర్ర హీరోల మధ్య వార్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తన కెరియర్లో ఫస్ట్ టైమ్ ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: