సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ నను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మళ్లీ మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇటీవలే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను చూస్తుంటే అలియా అదరగొట్టేసింది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఒక సాధారణ అమ్మాయి గంగూబాయి పవర్ ఫుల్ వ్యక్తిగా ఎలా మారింది.. రాజకీయ నాయకురాలిగా ఎదగడం కోసం ఆమె చేసిన పోరాటాన్ని, ఆమె ప్రయాణాన్ని చూపించారు. ఇంకా అజయ్ దేవగన్, విజయ్ రాజ్, జిమ్ సర్భ్ కీలక పాత్రలలో కనిపించారు. ఇక ట్రైలర్ చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు అలియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది అలియా.ఈసినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకునేలా ఉంది.
GANGUBAI ZINDABAD 🌙🙏🏼
Trailer out now – https://t.co/fKSzGKKQc4#GangubaiKathiawadi in cinemas on 25th Feb.#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal— Alia Bhatt (@aliaa08) February 4, 2022
కాగా ఈ సినిమాలో ఆలియా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























