బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం బాలీవుడ్ వాళ్లకు మాత్రమే కాదు ఇప్పటి వరకూ ఇక్కడ సినిమాలు చేయకపోయినా కూడా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్నేళ్లకు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది దీపికా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసి కొంతవరకూ పూర్తి చేసుకుంది కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈరోజు దీపికా పుట్టినరోజు. ఈసందర్భంగా దీపికాకు స్పెషల్ బర్త్ డే విషెస్ అందించాడు ప్రభాస్. హ్యాపీ బర్త్ డే దీపికా.. నీ ఎనర్జీ, టాలెంట్ వల్ల సెట్ కే హై వస్తుందని.. విష్ యూ ద బెస్ట్ అంటూ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేశాడు.

ఇక ఈసినిమాలో అమితాబ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది కూడా. ఈ సినిమాకు మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నిర్మాత సి.అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























