బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సోనూసూద్ లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా మారారు. ఇప్పటివరకు విలన్‌గానే కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ ఇప్పుడు రీల్ హీరోగా మారారు. జీ స్టూడియోస్, శక్తిసాగర్ ప్రొడక్షన్స్‘ బ్యానర్స్ పై అభినందన్ గుప్తా దర్శకత్వంలో సోనూసూద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “ఫతేహ్” హిందీ మూవీ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ “బాజీరావ్ మస్తానీ, పద్మావత్” చిత్రాలకు దర్శకత్వ శాఖా లో పనిచేసిన అభినందన్ గుప్తా ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు.ఇండియాలోని ఓ శత్రువుపై చేస్తున్న వన్ మ్యాన్ పోరాటమే “ఫతేహ్”అనీ , మరింత యాక్షన్‌తో 2022 ఏడాదిని స్వాగతిస్తున్నాననీ , స్క్రిప్ట్ విన్న వెంటనే ఇందులో భాగస్వామ్యం కావాలని అనుకున్నాననీ సోనూసూద్ చెప్పారు. మరి ఇప్పుడు రీల్ విలన్ నుంచి రీల్ హీరోగా మారుతున్న సోనూసూద్ హీరోయిజాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























