‘మహానటి’ సినిమాతో సావిత్రి గారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ k’ చేయబోతున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఇటీవలే ప్రారంభించగా ముందు అమితాబ్ తో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ తర్వాత మిగిలిన నటీనటులతో షూటింగ్ ను చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీఫిలిం సిటిలో జరుగుతుండగా రీసెంట్ గానే ప్రభాస్-దీపికా కూడా ఈసినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ తో సినిమా అంటే షూటింగ్ సంగతి పక్కన పెడితే ఆయన ఇచ్చే ఫుడ్ ట్రీట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆయనతో నటించిన చాలా మందికి ఎక్స్ పీరియన్సే ఇది. రకరకాల వంటకాలను స్పెషల్ గా చేయించుకొని తీసుకొస్తుంటారు. ఇక ప్రభాస్ చేయించే వంటకాలను రుచి చూసిన వాళ్లు దాని గురించి స్పెషల్ గా చెబుతుంటారు కూడా. తాజాగా దీపికాకు కూడా ప్రభాస్ ఫుడ్ ట్రీట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఇక ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ట్రీట్ కు సంబంధించి దీపికా తన సోషల్ మీడియా ద్వారా ఫొటోలను షేర్ చేస్తూ తెలిపింది. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు కూడా తెలిపింది.

అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























