వచ్చే ఏడాది వచ్చే పెద్ద సినిమాల్లో కె.జి.యఫ్2 కూడా ఒకటి. ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్ లో వచ్చిన పార్ట్ 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇప్పుడు పార్ట్ 2 వస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీనిలోభాగంగానే ఒక్కొక్కరూ తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇక తాజాాగా ఈసినిమాలో అధీరా అనే కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేశాడు. ఈవిషయాన్ని సంజయ్ దత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘‘అధీర యాక్షన్ లోకి వచ్చేశాడు. కె.జి.యఫ్ చాప్టర్ 2 కోసం డబ్బింగ్ పూర్తయింది. ఏప్రిల్ 14న మీ అందరి ముందుకు వచ్చేస్తాడు’’ అంటూ సంజయ్ దత్ ట్వీట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Adheera is back in action! The dubbing sessions are done for #KGFChapter2 and is on its way to theaters near you on 14th April 2022! pic.twitter.com/xBYvvc2XYK
— Sanjay Dutt (@duttsanjay) December 7, 2021
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
కాగా ఈసినిమా నుండి పలు పోస్టర్లు, యష్ బర్త్ డే సందర్భంగా టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. చాలా రోజుల నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. మరి త్వరలో ప్రమోషన్స్ ను స్టార్ చేసి వరుసగా అప్ డేట్స్ ఇస్తారేమో చూడాలి. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























