మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేయనున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ది వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ బిగిన్స్ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























