యంగ్ హీరో నాగచైనత్య బర్త్ డే హంగామా అప్పుడే మొదలైంది. రేపు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజే బంగార్రాజు సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున -నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బంగార్రాజు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇక ఈసినిమా నుండి తాజాగా నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు టీజర్ ను కూడా రేపు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. రేపు ఉదయం 10 గంటల 23 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here is the First Look of
🔥బంగార్రాజు🔥@chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_ @lemonsprasad#Bangarraju #BangarrajuComing#HBDChay pic.twitter.com/iYDDy1qzUp— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 22, 2021
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగచైతన్య కి జోడీగా కృతి శెట్టి నటించనున్న సంగతి కూడా తెలిసిందే. కృతి శెట్టి పోషిస్తున్న ‘నాగలక్ష్మి’ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈసినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: