రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీదున్నాడు. వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇందులో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇందులో గాడ్ ఫాదర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా… భోళా శంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఊటీలో ఒక షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకొని వచ్చారు. అయితే ఈసినిమా తరువాత షెడ్యూల్ కు కాస్త గ్యాప్ ఉండటంతో భోళా శంకర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే మేకర్స్ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది.
కాగా ఈసినిమాలో చిరంజీవి కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమా తమిళ్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ అయినా మెహర్ రమేష్ మాత్రం స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: