ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈసినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమయ్యే పనిలో ఉంది. దీనిలో భాగంగానే శర్వా కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























