బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఆ రెండు సినిమాలు మంచి విజయం దక్కించుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల అది కుదరలేదు. ఇక ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరలో ముగించనున్నారు.
THE MIGHTY #AKHANDA WRAPS UP SHOOT ♥️ WITH A SONG . Going to ROAR 🦁 BIG TIME IN THEATRES SOON ⚡️⚡️
THE BLOCKBUSTER COMBINATION OF #NBK GAARU & #BOYAPATI GAARU #BB3 🦁ARE READY FOR A HATRICK 💥💥💥
God bless !! ⭐️ pic.twitter.com/GVOLFLnv8f
— thaman S (@MusicThaman) October 5, 2021
కాగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి దసరాకు ఈసినిమా వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు. ఇక ఇప్పుడు దీపావళికి ఈసినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నవార్తలు వస్తున్నాయి. చూద్దాం దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇస్తారేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: