కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తవ్వగా ఇంకా రెండు పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈగ్యాప్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కూడా పూర్తి కావడంతో శంకర్‌తో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఆచార్య టీమ్ మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవి, చరణ్‌లపై ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్నారట. అలాగే రామ్ చరణ్, పూజా హెగ్డే కు సంబంధించి కూడా ఒక సాంగ్ ను చిత్రీకరించనున్నారట. ఇక ఈరెండు పాటలకు దాదాపు ఒక వారం రోజులు పడుతుందని.. ఈ నెలాఖరులోగా ‘ఆచార్య’ మొత్తం షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు మేకర్స్.
కాగా ఈసినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చినా ఇప్పుడు అక్టోబర్ నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారట. మరి రిలీజ్ పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























