మెగాస్టార్ చిరు రీఎంట్రీ తరువాత వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో ముందుగా కొరటాలతో వస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే. అసలు కరోనా లేకపోతే ఈ ఆగష్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమాకోసం భారీ స్థాయిలో సెట్స్ కూడా వేయనున్నట్టు తెలుస్తుంది. ఆ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిరంజీవి లైనప్ చేసిన సినిమాల్లో డైరెక్టర్ బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉన్న సంగతి తెలిసిందే కదా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈసినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం చిరు రేంజ్ కు తగ్గట్టు ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌ను సెలక్ట్ చేసుకుని కథ తయారు చేసుకున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈనేపథ్యంలో దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ లో దసరా పండగ నాడు ఈసినిమాను ప్రారంభించాలని ఆ దిశగా ఏర్పాట్లు జరుపుకుంటున్నారట.
మరి బాబి కంటే ముందే చిరు మెహర్ రమేష్ తో సినిమా కమిట్ అయ్యారు. కానీ బాబి సినిమానే త్వరగా సెట్స్ పైకి తీసుకువస్తున్నారు. మరి మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ అని గతంలో వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో రీమేక్ చేస్తారా లేక స్టైయిట్ మూవీ చేస్తారా అన్నది చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























