మెగాస్టార్ చిరు గతంలోనే ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు.. ఆతరువాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరోసారి చిరు డ్యూయల్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటునే ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈసినిమాల తరువాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసందే కదా. మెహర్ రమేష్ తో ఒకసినిమా ఉండగా.. బాబితో మరో సినిమా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమాలో సోనాక్షీ సిన్హా, నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి నటీనటులు నటిస్తున్నారంటూ వార్తలు రాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈసినిమాలో చిరు
ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తండ్రీ కొడుకులుగా చేస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈసినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. లూసిఫర్ పూర్తి కాగానే బాబీ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























