మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎస్ ఎల్ వి సినిమాస్ , రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ
షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖిలాడి ” మూవీ కి ఒక సాంగ్ , కొన్ని యాక్షన్ సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఆఖరు షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఆఖరు షెడ్యూల్ 26 వ తేదీ ప్రారంభిస్తున్నట్టుగా మేకర్స్ ఒక అధికారిక అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు . హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో డింపుల్ హాయతి , మీనాక్షి చౌదరి కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “ఖిలాడి”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































