వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న వరుణ్ ఫైనల్ రౌండ్ కు రెడీ అయ్యాడు. ఈరోజు నుండి గని ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈవిషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియచేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mega prince @IAmVarunTej ‘s #Ghani final shoot schedule in progress, the climax boxing episode will be shot in this schedule 🔥🥊@nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/aWtBhPdH2D
— Geetha Arts (@GeethaArts) July 10, 2021
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























