ఒక సినిమా హిట్ అయితే సీక్వెల్స్ తీయడం కామన్ అయిపోయింది ఇప్పుడు. అయితే మన తెలుగు సినిమాలకు ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే సీక్వెల్స్ బాగా ఆడిన సినిమాలు దాదాపు చాలాా తక్కువే ఉన్నాయి. అంతేకాదు ఇది ఒక సెంటిమెంట్ లాగా కూడా అయిపోయింది. ఇక ఒక సినిమాకు ఒక సీక్వెల్ చేయడమే పెద్ద రిస్క్ అనుకుంటే ఓంకార్ మాత్రం రాజు గారి గది సినిమాకు మాత్రం సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీసుకుంటూ వెళుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బుల్లి తెరపై యాంకర్ గా తన మార్క్ చూపించి డైరెక్టర్ మారిన ఓంకార్ మొదట జీనియస్ అంటూ ఒక డిజాస్టర్ సినిమా తీశాడు. ఆ తరువాత రాజుగారి గది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏ ముహూర్తంలో చేశాడో తెలియదు కానీ అప్పటి నుంచి వరుసగా సీక్వెల్స్ చేస్తూనే ఉన్నాడు. రాజు గారి గది 2 ఏకంగా నాగార్జున హీరోగా చేశాడు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా ఫలితం తేడా కొట్టింది. అయినా కూడా రెండు సంవత్సరాల కింద రాజు గారి గది 3 చేశాడు. అవికాగోర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో ఈ సీక్వెల్ కు బ్రేక్ పడినట్టే అనుకున్నారు. కానీ రాజు గారి గది 4 కూడా రెడీగా ఉంది అంటూ ఓంకార్ అనౌన్స్ మెంట్ చేశాడు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓంకార్ ‘రాజు గారి గది 4’ స్క్రిప్ట్ రెడీ అయిందని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాతోపాటు ఓ థ్రిల్లర్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యంలో కథలు రాస్తున్నానని కానీ కరోనాతో ఇవేవీ పట్టాలెక్కలేదని తెలిపాడు. మరి త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళతాడేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: