పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచి పోయినా ఇటలీ లో జరిగిన “థ్యాంక్ యు” మూవీ షూటింగ్ లో రాశీఖన్నా పాల్గొన్నారు. లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోవిడ్ సంక్షోభ సమయంలో ముందుకొచ్చి సాయం చేసినపుడే సెలబ్రిటీ స్టేటస్ కు సరైన అర్థం ఉంటుందనీ , తన చుట్టూ ఉన్న వారికి సాయం చేసినపుడే ఎవరైనా సెలబ్రిటీ అని పిలవబడతారనీ రాశీఖన్నా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క వ్యక్తి ఏం చేయలేరనీ , అందరం కలిసి సాయం చేయాల్సిన సమయం ఇదనీ , ఎన్జీవోస్ సాయంతో తన వంతుగా హెల్ప్ చేస్తున్నాననీ , పేదల ఆకలిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాననీ , సెలబ్రిటీస్ అంతా ముందుకు వచ్చి తమవంతు సాయం చేయాలనీ రాశీఖన్నా కోరారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























