పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ దర్శకత్వంలో “#PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన“గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కాలేజీ నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ “PSPK 28 ” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కై ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి భారీ కాలేజీ సెట్ ను రూపొందించారు. “PSPK 28 ” మూవీ లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా నటించనున్నారని సమాచారం. ఈ మూవీ కి “సంచారి ” టైటిల్ పరిశీలనలో ఉంది. జూలై నెలలో
“అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ ను పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేస్తారనీ , ఆగస్ట్ నెలలో “హరిహర వీరమల్లు “, “#PSPK 28 ” మూవీ షూటింగ్స్ లో పాల్గొంటారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: