ప్రముఖ నిర్మాత, సీనియర్ సినీ పీఆర్వో బిఏ రాజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే కదా. బిఏ రాజు మరణంతో ఇండస్ట్రీ నిజంగా ఒక మంచి పీఆర్వోని కోల్పోయినట్టే. అలాంటి పీఆర్వో ఇప్పటివరకూ లేడు..ఇకపై రాడు అన్నంత పేరు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క సినిమా గురించి ఆయన దగ్గర అప్ డేట్ ఉంటుంది. కలెక్షన్ల్ రిపోర్ట్ ఉంటుంది. రిలీజ్ డేట్ లు నాలుకపైనే ఉంటాయి. ఇలా ప్రతి
క్షణం సినిమాల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టే మేకర్ కూడా తనపై నమ్మకంతో ఉండేవాళ్లు.. దీంతోనే ఇండస్ట్రీలో వేయి పైగా సినిమాలకు పీఆర్వో గా పనిచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బిఏ రాజు తరువాత ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలను తనయుడు శివ కుమార్ తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ విషయాన్ని తన నాన్నగారి ట్విట్టర్ అకౌంట్ ద్వారా తీశాడు. నా తల్లి దండ్రుల అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయం తీసుకున్నా… నాన్న గారి ప్రారంభించిన సూపర్ హిట్ మ్యాగజైన్ అలానే నాన్న గారితో ఉన్న పీఆర్ టీమ్ తోనే పని చేయాలనుకుంటున్నాను..ఈసందర్భంగా సినీ ఇండస్ట్రీ పెద్దలకు ఒక విన్నపం చేస్తున్నాను.. మీ సపోర్ట్ ను నాకు అందిస్తారని నమ్ముతున్నా.. నా ఈ కొత్త జర్నీకి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నానని కోరాడు.
Humble Request To Prominent Personalities Of The Tollywood & Film Media Friends
– Shiva Kumar B.
(S/O B.A. Raju)@shivakumar2204 pic.twitter.com/ZuUvGs6w76— BARaju (@baraju_SuperHit) May 23, 2021
ఇక బిఏ రాజు సతీమణి బిఏ జయ. ఆమె దర్శకురాలు.. ఈమధ్య కాలంలోనే ఆమె మరణించారు. శివ దర్శకత్వం వహించిన `22` ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈసినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































