అంతర్జాతీయ బ్రదర్స్ డే. ఇక ఈసందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా తమ సోదరులకు విషెస్ తెలుపుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా తమ సోదరులతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే ను గుర్తుచేసుకున్నారు. తన సోదరులు నాగబాబు – పవన్ కళ్యాణ్ లతో దిగిన చిన్న నాటి ఫొటోను పోస్ట్ చేసి.. తోడ బుట్టిన బ్రదర్స్ కి.. రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!” అని అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021
ఇక చిరు ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎలాగూ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈసినిమా షూటింగ్ అయిపోయి ఉండేది. ఇక కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే తుది దశలో ఉన్న ఆచార్య షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. వీటితో పాటు మరో రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ముందుగా మొదలపెట్టనున్న సినిమా లూసిఫర్ రీమేక్. రామ్ చరణ్ నిర్మాతగా మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. జులైలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈసినిమా తరువాత మెహర్ రమేష్, ఆ తరువాత బాబి తో సినిమాలు చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: