గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ తరుపున బర్త్ డే విషెస్ తెలిపారు. మా కావ్య నాయకి సమంత గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing our ‘Kavya Nayaki’ @Samanthaprabhu2 garu a very Happy Birthday. #Shaakuntalam 🤍#HBDSamanthaAkkineni pic.twitter.com/N3ykrOcKdJ
— Gunaa Teamworks (@GunaaTeamworks) April 28, 2021
ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఈసినిమాలో మరో కీలక పాత్రలో తమిళ నటి అదితి బాలన్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించే గుణశేఖర్ సినిమాల్లో భారీ సెట్లు, పెద్ద స్టార్ క్యాస్ట్, గ్రాండ్ విజువల్స్ ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యాన్ని చూపించడానికి వచ్చేస్తున్నాడు. ఈసినిమాను కూడా చాలా గ్రాండియర్ గా రూపుదిద్దనున్నాడు గుణశేఖర్. ఈసినిమా కోసం భారీ సెట్స్‌ను దుస్తులు, కేళాలంకరణలు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు. మరి ఈ ప్రేమకావ్యాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























